గోదావరి ఉద్ధృతితో రివర్ఫ్రంట్కు ముప్పు.. అప్రమత్తమైన అధికారులు.. అత్యవసర రక్షణ చర్యలు ప్రారంభం
రాజనీతి ప్రతినిధి, రాజమహేంద్రవరం | ఆగస్టు 1, 2026 ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో నగరంలోని రివర్ఫ్రంట్ సమీపంలో నదీ గట్టు పలు చోట్ల తీవ్రంగా కోతకు గురవుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. గట్టు మరింత దెబ్బతినకుండా నిలువరించేందుకు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. పరిస్థితిని పరిశీలించిన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు కోతకు గురవుతున్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన రక్షణ పనులు ప్రారంభించారు. ప్రవాహ వేగాన్ని తగ్గించి గట్టును కాపాడేందుకు భారీ ఎత్తున ఇసుక బస్తాలను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక రక్షణ గోడలను నిర్మిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ...