ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ.. ఒక్కరోజులో ₹17,900 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

అమరావతి, పోలవరం, భోగాపురం సహా కీలక ప్రాజెక్టులకు ప్రారంభం.. ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన పీఎంఓ రాజనీతి | 31 జూలై 2026 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసింది. ఈ పర్యటనలో రాష్ట్రంలో రూ.17,900 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు...