జగన్.. శ్రీకాకుళం పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి!-మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్న జగన్..

రాజనీతి | 30 జూలై 2026 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం అంపోలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. ఎన్నికల అనంతరం జగన్ శ్రీకాకుళం జిల్లాకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పర్యటనలో భాగంగా జగన్ ముందుగా అంపోలు జిల్లా జైలుకు వెళ్లి అప్పలరాజును కలవనున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్...