సాయికృష్ణ కేసులో మరో కీలక మలుపు.. హైకోర్టు ముందుకు కొత్త ప్రశ్నలు – హెబియస్ కార్పస్ ఉపసంహరణపై వివరణ కోరిన న్యాయస్థానం!

వార్త: సంచలనం సృష్టించిన గాడే సాయికృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన అభ్యర్థనను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయంపై సాయికృష్ణ తల్లి నుంచి పూర్తి వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. విచారణ సందర్భంగా పిటిషన్ ఉపసంహరణకు గల కారణాలను స్పష్టంగా వివరించాలని ధర్మాసనం సూచించింది. అవసరమైతే తిరిగి కొత్త పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛ కూడా ఉందని పేర్కొంది. ఇదే అంశంపై ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా, అదే విషయంపై మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడాన్ని హైకోర్టు అనుమతించకుండా తిరస్కరించింది. ఇక మరోవైపు...