పొగ తాగేది మీరు... కానీ దెబ్బ తినేది ఊపిరితిత్తులు, గుండె, కుటుంబం!

పొగ తాగడం మానేయండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగే మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలుస్తోంది. సిగరెట్, బీడీ లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను తరచుగా వినియోగించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, శ్వాసకోశ సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. హెచ్చరికలు ఉన్నప్పటికీ, చాలా మంది "ఒక్కటి తాగితే ఏమవుతుంది?" అనే భావనతో పొగాకు అలవాటును కొనసాగిస్తున్నారు. కానీ ప్రతి సిగరెట్ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం చేసే వ్యక్తులతో పాటు వారి చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కూడా పరోక్ష ధూమపానం (Passive Smoking) వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే...