కీలక రక్షణ కేంద్రాలకు కార్చిచ్చు ముప్పు.. అప్రమత్తమైన ఫ్రాన్స్!

పారిస్: ఫ్రాన్స్‌ను చుట్టుముట్టిన భారీ కార్చిచ్చు ఇప్పుడు ఆ దేశ రక్షణ వ్యవస్థకే సవాల్‌గా మారింది. నైరుతి ఫ్రాన్స్‌లో వేగంగా వ్యాపిస్తున్న అడవి మంటలు దేశ అణు నిరోధక శక్తికి కీలకమైన ఎం-51 అణు క్షిపణి తయారీ కేంద్రాలు, అలాగే రఫేల్ యుద్ధ విమానాల తయారీ, పరీక్షా కేంద్రాల దిశగా విస్తరిస్తుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. మంటల ప్రభావం రక్షణ పరిశ్రమలపై పడకుండా ఉండేందుకు ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, సైనిక బృందాలు సంయుక్తంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. కీలక ప్రాంతాల చుట్టూ ఫైర్‌బ్రేక్‌లు ఏర్పాటు చేసి, అత్యవసర ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో...