మోడీకి మొక్కలతో మహా స్వాగతం.. భోగాపురంలో 30 వేల మొక్కలతో గ్రీన్ వెల్‌కమ్!

విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు. పూలతో కాకుండా 30 వేల మొక్కలతో హరిత స్వాగతం పలకాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధికి చారిత్రక ఘట్టంగా భావిస్తున్న ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. మొక్కల పంపిణీతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీ స్థాయిలో ఏర్పాట్లు...