పీలేరులో చెడ్డి గ్యాంగ్ కదలికలు అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా.. ప్రజలు వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచన.

పీలేరు రాజనీతి 2026-07-28:- పీలేరు పట్టణంలో చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పట్టణంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. బీట్ పోలీసింగ్‌ను పెంచడంతో పాటు క్రైమ్ విభాగం సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన కదలికలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా ఆలస్యం చేయకుండా పోలీసులకు...