ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం నిశ్శబ్దంగా ప్రాణాలను హరిస్తున్న హెపటైటిస్

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం – జూలై 28, 2026 "Hepatitis: Let's Break It Down" అనే సందేశంతో 2026 జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హెపటైటిస్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షలు, టీకాలు, సకాలంలో చికిత్స ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. హెపటైటిస్ అనేది కాలేయాన్ని (లివర్) ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. హెపటైటిస్ A, B, C, D, E అనే ఐదు ప్రధాన రకాలుగా ఉంటుంది. వీటిలో ముఖ్యంగా హెపటైటిస్-B, హెపటైటిస్-C దీర్ఘకాలికంగా కొనసాగి కాలేయ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)...