BSNL అదిరిపోయే ఆఫర్.. రూ.1,449కే 6 నెలలు బ్రాడ్‌బ్యాండ్, 700GB డేటా, OTTలతో బంపర్ ప్లాన్!

న్యూఢిల్లీ: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారులను ఆకట్టుకునే మరో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.1,449తో 6 నెలల వ్యాలిడిటీ, 700GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత OTT ప్రయోజనాలు కలిగిన ప్రత్యేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు మొత్తం 700GB డేటా లభిస్తుంది. నిర్ణీత డేటా పరిమితి పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయి. అయితే స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంటి వినియోగదారులు, ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో స్ట్రీమింగ్ అవసరాలకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ...