🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 22 Jul, 2026 | Page: 1

మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం.. సోదరి మృతికి పవన్ కళ్యాణ్ నివాళి



టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరి సుంకర మెహర్ జ్యోతి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు.

ఆసుపత్రి వద్ద ఉంచిన మెహర్ రమేష్ సోదరి పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి, భౌతిక కాయంకు నివాళులర్పించారు.
🏠 Home