మదనపల్లె పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

పట్టణంలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో... బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు.
ముందుగా రామారావు కాలనీలోని సంప్‌ను పరిశీలించారు. సంపు ద్వారా నీటి సరఫరా వ్యవస్థ గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాను వేగవంతం చేయాలని, సంప్‌లను వేగంగా నింపేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అగ్నిమాపక శాఖ వాహనాలను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. అలాగే అదనంగా వాహనాల అవసరం ఉంటే, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ వాహన యజమానులతో సమన్వయం చేసి అవసరమైన వాహనాలను మున్సిపాలిటీకి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం వేంపల్లి చెరువును సందర్శించిన జిల్లా కలెక్టర్... చెరువులో నీటి లభ్యత, బోర్ల పరిస్థితి, నీటి సరఫరాకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. అక్కడి వేంపల్లి సంప్‌ను తనిఖీ చేసి పట్టణంలోని మొత్తం తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించారు.
పట్టణంలో నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంక్రమించి, నీటి పంపిణీని స్ట్రీమ్‌లైన్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా, సురక్షితమైన తాగునీరు అందించేందుకు పటిష్టంగా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, జ్ఞాపక శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
-----------------------------------///-------------------------- *డిఐపిఆర్ఓ,అన్నమయ్య జిల్లా*