విద్యార్థుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యంపై దాడి – ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి
పీలేరు రాజనీతి 2026 JULY 20:-
విద్యార్థుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యంపై దాడి – ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి. జనార్దన్, మంగిరి సాంబశివ, పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టి.ఎల్. వెంకటేష్
దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేపడుతుంటే, వారిపై బీజేపీ ప్రభుత్వం అమానుషంగా లాఠీచార్జీలు చేయించడం, 7 అడుగుల ఎత్తైన బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడం, మెట్రో స్టేషన్లను మూసివేసి విద్యార్థులను నిర్బంధించడం, వేలాది మంది పోలీసులను మోహరించి భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య విలువలపై బహిరంగ దాడి అని సీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.
సోమవారం సీపీఐ కార్యాలయంలో సీపీఐ నాయకులు విలేకరులతో మాట్లాడారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఏలో వరుసగా బయటపడుతున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకులు, అవినీతి ఆరోపణలతో దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు యువ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్పందించకుండా, బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారిపై పోలీసు నిర్బంధం ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా నిజాలను దాచలేరని, దేశ యువత ఆవేదనను ప్రభుత్వం వెంటనే వినాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిర్బంధ చర్యలను నిలిపివేయాలని, ఎన్టీఏ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను అణచివేయడం మానుకుని, వారి సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సమావేశంలో కవిత పాల్గొన్నారు