🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 20 Jul, 2026 | Page: 1

మహల్‌లో టీబీఎంబీఏ 2.0లో భాగంగా హెచ్‌హెచ్ ఎక్స్‌రే పరీక్షలు

ప్రెస్ నోట్

మహల్‌లో టీబీఎంబీఏ 2.0లో భాగంగా హెచ్‌హెచ్ ఎక్స్‌రే పరీక్షలు

మహల్ మండలంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ (TBMBA) 2.0 కార్యక్రమంలో భాగంగా ఈరోజు హెచ్‌హెచ్ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా టీబీ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న వల్నరబుల్ పాపులేషన్ వర్గాలకు చెందిన ప్రజలకు ప్రత్యేకంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.

మధుమేహం ఉన్నవారు, మద్యం సేవించే వారు, వృద్ధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మరియు ఇతర అధిక ప్రమాద వర్గాలకు చెందిన వారిని గుర్తించి హెచ్‌హెచ్ ఎక్స్‌రే ద్వారా పరీక్షలు నిర్వహించారు. టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ప్రజలు టీబీ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. టీబీని ముందుగానే గుర్తించి, పూర్తి చికిత్స తీసుకోవడం ద్వారా టీబీని పూర్తిగా నయం చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో STS నాగిరెడ్డి గారు, హెల్త్ సూపర్వైజర్, సుధాకర్, MLHP నాగవేణి గుండ్లూరు నాగవేణి , పల్లవలి, భానుప్రియ,ANMS రాజేశ్వరి, భవ్య టీం Fc రెహానా, ప్రభావతి, మాధవి రాణి, ఆశా రెడ్డి రాణి, శ్రీదేవి పాల్గొన్నారు.*ఆరోగ్య శాఖ అధికారులు, పాల్గొని ప్రజలకు టీబీపై అవగాహన కల్పించారు.
🏠 Home