🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 01 Jul, 2026 | Page: 1

బాల కార్మికత్వాన్ని నిర్మూలిద్దాం నవ సమాజానికి నాంది పలుకుదాం- మండల విద్యాశాఖ పీలేరు


" ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం " సందర్భంగా, 2026 జూన్ 1 నుండి 30 వరకు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా కార్యాచరణ మాసం లో భాగంగా చివరి రోజు పీలేరు మండలంలో
బాల కార్మిక వ్యవస్థ ను నిర్మూలిద్దాం నవ సమాజానికి బాటలు వేద్దాం ....!!! కార్యక్రమం జరిగింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా, జూన్ 30, - 2026: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా, జిల్లా వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రత్యేక తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు (జూన్ 30, 2026) పలు దుకాణాలు షాపులు మరియు హోటల్లు మెకానిక్ షెడ్లు పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ లేబర్ ఆఫీసర్ జగదీష్ గారు సిబ్బందితోపాటు, గ్రేట్ విజన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం బాబు
. విద్య, పోలీసు, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ,మరియు శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యాచరణను నిర్వహించారు. , పీలేరు పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ హేమసుందర్ జెట్టి
మండల్ లీగల్ సర్వీస్ అతారీటి నుంచి గట్టప్ప మండల విద్యాశాఖ నుంచి సిఆర్పిలు మురళీధర్, మాధవి తాజూన్ పాల్గొన్నారు
వీరు మాట్లాడుతూ ప్రతి చిన్నారి కి విద్య హక్కు - ప్రతి చిన్నారికి భవిష్యత్తుపై హక్కు
ఉందని తెలిపారు. పీలేరు పాత బస్టాండు, కోర్టు ఆవరణ, మరియు సదుం రోడ్డులోని షాపులు తనిఖీ చేసి బాల కార్మికులపై అవగాహన కల్పించారు. లేబర్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్
మునిదినేష్ మరియు స్థానిక హోటల్ యజమానులు వ్యాపారస్తులు, స్థానికులు,తదితరులు పాల్గొన్నారు.
🏠 Home