🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 01 Jul, 2026 | Page: 1

నిర్లక్ష్యం వద్దు- నిండు ప్రాణమే ముద్దు-అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి

పత్రికా ప్రకటన
తేదీ: 01.07.2026
అన్నమయ్య జిల్లా - మదనపల్లి

నిర్లక్ష్యం వద్దు- నిండు ప్రాణమే ముద్దు

మానవ జీవితం ఎంతో అమూల్యమైనది, చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు ప్రజలను కోరారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి.

మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లకు స్టీరింగ్ ఇవ్వడం వల్ల కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదు.

మరోవైపు అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌తోనే సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారని, అపరిచిత లింకులు క్లిక్ చేయడం, ఓటీపీలు చెప్పడం చేయరాదని, ఒకవేళ మోసపోతే వెంటనే '1930' కి కాల్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.

యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే '1098' కి, మహిళలు ఆపదలో ఉంటే తక్షణ సహాయం కోసం '112' కి డయల్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

చట్టాలను గౌరవిస్తూ సురక్షిత అన్నమయ్య జిల్లా సాధనలో అందరూ భాగస్వామ్యులు కావాలని పేర్కొన్నారు.
👇
అన్నమయ్య పోలీస్
🏠 Home