దగ్గు మాత్రమే టి. బి. వ్యాధి లక్షణం కాదు.
దగ్గు మాత్రమే టి. బి. వ్యాధి లక్షణం కాదు. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ, టి. బి. సూపర్వైసర్ నాగిరెడ్డి
నిమ్మనపల్లి 23/62026.
దగ్గు మాత్రమే టి. బి (క్షయ )వ్యాధి లక్షణం కాదని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు వాయల్పాడు టి. బి. యూనిట్ పర్యవేక్షకులు నాగిరెడ్డి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి ఆదేశాల మేరకు టి. బి. ముక్త్ భారత్ అభియాన్(2.0) 100రోజుల కార్యక్రమం లో భాగంగా మండలం లోని బాలేపల్లి లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నిర్వహిస్తున్న 104సేవలలో భాగంగా టి. బి. రహిత భారత్ పై ప్రజలు, విద్యార్థులుకు అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, నాగిరెడ్డి మాట్లాడుచు దగ్గు ఒక్కటి మాత్రమే టి. బి వ్యాధి లక్షణం కాదని రోజూ సాయంత్రం వేళ జ్వరం రావడం, గల్ల తో కూడిన దగ్గు, ఒక్కోసారి గల్ల లో రక్తం కనపడుట, అలసట, నీరసం, రాత్రి వేళ చమటలు పట్టుట, బరువు తగ్గుతాఉండటం, ఛాతిలో నొప్పి, ఆకలి లేక పోవడం, సారీరక ఆరోగ్యములో ఆకస్మిక మార్పు, ఏదైనా శరీర భాగం లో గుల్లలు, వాపు రావడం, గతం లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఇవన్నీటీలో ఏవి కనిపించినా క్షయ వ్యాధి అని అనుమానించి దగ్గర లోని ప్రభుత్వ అస్పటల్ లో గల్ల పరీక్షలు, ఛాతి ఎక్సరే తీయించుకోవాలి. ఇప్పుడు టి. బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా 104 సేవలలో కూడా గ్రామాల్లో అక్కడికి అక్కడే అనుమానిత రోగులకు ఛాతి ఎక్సరేలు తీయడం జరుగుచున్నది. బాలేపల్లి గ్రామం లో రేపు నెలలో ఎక్సరే మిషన్ ఇక్కడికే తెచ్చి హై రిస్క్ వారికి నిరద్దెశించిన వారికి తీయడం జరుగుతుంది అన్నారు. కావున. టి. బి. అనుమానిత లక్షణాలు ఉన్నవారు, హైరిస్క్ వారు తప్పకుండ ఎక్సరేలు తీసుకోవాలని సూచించారు.. టి. బి. వ్యాధి నిర్ధారణ కొరకు చేసే ప్రతీ పరీక్షలు పూర్తిగా ఉచితంగా అన్నీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో చేస్తారు. అలాగే వ్యాధి నిర్ధారణ ఐతే ఆరు నెలల పాటు మందులు పూర్తిగా ఉచితంగా డాట్స్ ద్వారా ఇస్తారు. రొగులు సమత్తుల ఆహరం తీసుకోవడానికి పి. ఎమ్. పోషన్ అభియాన్ పథకం ద్వారా నెలకు వెయ్యి రూపాయలు వారి ఖాతా లో ఆరు నెలలపాటు వేస్తారు. అంతేకాక దాతల ద్వారా కూడా పౌష్టిక ఆహారము అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ నెల క్రమం తప్పని ఫాలోఅప్ చేసుకొని పూర్తి ఆరోగ్య వoతులుగా ఉండవచ్చు అన్నారు. ఈ వ్యాధి పట్ల సమాజం లోని సామాజిక కలంకమును పారద్రోలి అందరమూ టి. బి లేని సమాజ స్థాపన లక్ష్యం సాధనకు ప్రతిజ్ఞ చేఇంచడం జరిగింది. అలాగే స్టాప్ డేఏరియా, మలేరియా వ్యతిరేక మాసోత్సవాలుగురించి అవగాహన కల్పించారు. ఈనెల 28వ తేదీ నిర్వహించు పల్స్ పోలియో కార్యక్రమం లో అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, టి. బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి,సి. హెచ్. ఓ /ఎమ్. ఎల్. హెచ్. పి. శకుంతల,,ఏ. ఎన్. ఎమ్.శోభారాణి, అంగన్వాడీ కార్యకర్త అరుణ,ఆశా కార్యకర్తలు సుకన్య, రేఖ, నాగరత్న, ఉపాధ్యాయ బృందం కార్తీక్, హరిప్రసాద్ , 104 సిబ్బంది,తల్లులు పాల్గొన్నారు.