జోరు వర్షాన్నీ లెక్కచేయకుండా రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో తహసీల్దార్ పరిశీలన
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గుత్తివారిపల్లి రైతులు చేసిన ఫిర్యాదుపై రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించారు. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతుల వద్దకు చేరుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.రైతుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ స్పందనపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.