🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 15 Oct, 2026 | Page: 1

కట్టమంచిలో కత్తులతో దాడి.. ఒకరి పరిస్థితి విషమం...క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది..

చిత్తూరు (రాజనీతి): చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కత్తులతో దాడి జరగడంతో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరో వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది (ఏపీ 40 జి 0414) వెంటనే స్పందించారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ భువనేశ్వర్‌ రెడ్డి, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ ధరణి దేవి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు.ఘటనపై సమాచారం అందుకున్న చిత్తూరు ఒకటవ పట్టణ సీఐ చిన్న పెద్దయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల వివరాలను సేకరిస్తున్నారు. ఘర్షణకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.
🏠 Home