🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 08 Oct, 2026 | Page: 1

ప్రజలే బలం... ప్రజలే అండ! కజూర్ బాలాజీ దూకుడుకు జేజేలు

చిత్తూరు(రాజనీతి): ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో చిత్తూరు టీడీపీ సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రజలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.ప్రజలే నా బలం అనే నినాదంతో ముందుకు సాగుతున్న కజూర్ బాలాజీ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయనతో కలిసి ప్రయాణిస్తూ వాటి ఉద్దేశాలను ప్రజలకు వివరించడం ద్వారా ప్రజల్లో మరింత చేరువ అవుతున్నారు.నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించడం వంటి చర్యలతో కజూర్ బాలాజీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో చిత్తూరు మేయర్ పదవికి కజూర్ బాలాజీ పేరు తెరపైకి రావాలని పలువురు ప్రజలు, పార్టీ అభిమానులు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.అయితే మేయర్ అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నేపథ్యంలో కజూర్ బాలాజీ పేరు ప్రస్తుతం చిత్తూరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
🏠 Home