చిత్తూరు బిడ్డ.. ప్రజల ముద్దుబిడ్డ.. కజూర్ బాలాజీ!...
చిత్తూరు(రాజనీతి): ‘‘వచ్చాడయో స్వామి.. ప్రజల కోసం నిలబడే నాయకుడు వచ్చాడు’’ అంటూ కజూర్ బాలాజీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారంటూ ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఎన్నికల వేడి మొదలుకాకముందే చిత్తూరు రాజకీయాల్లో కజూర్ బాలాజీ పేరు చర్చనీయాంశంగా మారింది. ‘‘యుద్ధం.. యుద్ధం.. ఎన్నికలకు సిద్ధం’’ అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుండగా, ‘‘నేను సైతం.. ప్రజల కోసమే’’ అంటూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కజూర్ బాలాజీ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెబుతున్నారు.‘‘ఏ బిడ్డ.. చిత్తూరు బిడ్డ.. కజూర్ బాలాజీ.. చిత్తూరు ప్రజల ముద్దుబిడ్డ’’ అంటూ ఆయన అభిమానులు, అనుచరులు నినదిస్తున్నారు. ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో చురుగ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ పదవికి కజూర్ బాలాజీని ఎంపిక చేయాలని కొందరు ప్రజలు కోరుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే మేయర్ అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదేనని నాయకులు చెబుతున్నారు. అధిష్ఠానం నిర్ణయం కోసం చిత్తూరు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కజూర్ బాలాజీ పేరు మేయర్ రేసులో వినిపిస్తుండటంతో చిత్తూరు రాజకీయాల్లో ఈ అంశంపై చర్చ మరింత వేడెక్కింది.