🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 03 Oct, 2026 | Page: 1

చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌మోహన్‌ దెబ్బకు.. సంతపేటలో అభివృద్ధి వెలుగులు

చిత్తూరు(రాజనీతి): ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ అన్నారు. సంతపేటలో రూ.476.95 లక్షల విలువైన అభివృద్ధి పనులను శనివారం ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రూ.140.50 లక్షలతో నిర్మించిన కాలువ, రూ.336.45 లక్షలతో నిర్మించిన 300 కిలోలీటర్ల సామర్థ్యమున్న జీఎస్‌ఎల్‌ఆర్‌ ట్యాంకును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. సంతపేట ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న కాలువలు, రోడ్లు, వీధిలైట్ల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఎన్టీఆర్‌ జలాశయం నుంచి ట్యాంకుకు నీటిని తరలించడం ద్వారా వేలాది కుటుంబాలకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు సంతపేటలో స్లాటర్‌హౌస్‌, పోలీసుస్టేషన్‌, రోడ్లు, వీధిలైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం చిత్తూరులో అభివృద్ధే ఉంటుందని, రౌడీయిజానికి తావుండదని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రారంభోత్సవం సందర్భంగా సంతపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, కమిషనర్‌ పి.నరసింహ ప్రసాద్‌, ఎంఈ చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌, మాజీ ఎమ్మెల్సీ బీఎన్‌ రాజసింహులు, కూటమి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home