🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 03 Oct, 2026 | Page: 1

స్వచ్ఛంద సేవకూ అడ్డంకులా? పీ-4 పిలుపుకు స్పందిస్తే కక్ష సాధింపా..? అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకోవడం సమంజసం కాదు: ప్రవీణ్‌నాయుడు

చిత్తూరు(రాజనీతి): ప్రజల కోసం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపడుతుంటే సొంత పార్టీ నాయకులే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చిత్తూరు రూరల్ మండలం అనంతాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రవీణ్‌నాయుడు ప్రశ్నించారు. శనివారం అనంతాపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చిన్ననాటి నుంచి టీడీపీ, చంద్రబాబునాయుడు అభిమానిగా ఉన్నానని, గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొన్నానని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (పీ-4) కార్యక్రమంతో స్ఫూర్తి పొంది సొంత నిధులతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు. గ్రామంలో దొంగతనాలు, హత్యల నేపథ్యంలో రూ.4 లక్షలకు పైగా వెచ్చించి వీధిదీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చర్చికి తాగునీటి సింథటిక్ ట్యాంకు, వాటర్ డిస్పెన్సరీలు, సీసీ కెమెరాలు, దేవాలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.అయితే టీడీపీ నేత జయచంద్రనాయుడు, మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్ తన సేవా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ప్రవీణ్‌నాయుడు ఆరోపించారు. తనను, కుటుంబ సభ్యులను దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారని, భౌతిక దాడికి ప్రయత్నించిన సందర్భాలూ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లానని, సమస్య పరిష్కారం కాకుంటే చంద్రబాబునాయుడు, లోకేష్‌కు మరోసారి ఫిర్యాదు చేస్తానన్నారు. పీ-4 పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు జోక్యం చేసుకోవాలని ఈవోపీఆర్డీ, ఎంపీడీవో, డీపీవో, జిల్లా కలెక్టర్‌ను కోరారు.
🏠 Home