ఫోన్ నంబర్.. లింక్.. మెసేజ్ ఏదైనా సరే.. ఇక స్కామ్ చెక్ చేయొచ్చు!
రాజనీతి | టెక్నాలజీ | సెప్టెంబర్ 30, 2026
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్, అనుమానాస్పద లింక్, బ్యాంక్ పేరుతో వచ్చిన మెసేజ్.. ఏది నిజమో, ఏది మోసమో తెలుసుకోవడం చాలాసార్లు కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో Truecaller కొత్తగా Scam Checkerను తీసుకొచ్చింది. అనుమానం ఉన్న ఫోన్ నంబర్, వెబ్ లింక్, మెసేజ్‌ను ఒకే చోట చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
నంబర్‌ను చెక్ చేయొచ్చు
మోసపూరిత కాల్స్, ఫిషింగ్ లింకులకు చెక్.. Truecaller కొత్త Scam Checker సేవ భారత్‌లో అందుబాటులోకి
ఎవరైనా అనుమానాస్పద నంబర్ నుంచి సంప్రదిస్తే.. ఆ నంబర్‌ను Scam Checkerలో సెర్చ్ చేయవచ్చు. Truecaller డిటెక్షన్ వ్యవస్థలతో పాటు యూజర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించి Safe లేదా Potential Fraud వంటి ఫలితాలను చూపిస్తుంది. అయితే నంబర్‌కు సంబంధించిన అదనపు వ్యక్తిగత వివరాల కోసం సాధారణ Truecaller సేవ అవసరం కావచ్చు.
లింక్ క్లిక్ చేసే ముందు జాగ్రత్త
వాట్సాప్, SMS లేదా ఇతర మార్గాల్లో వచ్చిన అనుమానాస్పద వెబ్ లింక్‌ను ముందుగా Scam Checkerలో చెక్ చేయవచ్చు. లింక్ ఫిషింగ్ లేదా హానికరమైన వెబ్‌సైట్‌కు సంబంధించినదిగా ఉండే అవకాశాలను ఈ టూల్ పరిశీలిస్తుంది.
మెసేజ్ కూడా పరిశీలించొచ్చు
ఇక పూర్తిగా వచ్చిన అనుమానాస్పద మెసేజ్‌ను కూడా పరిశీలించేందుకు వీలుంది. అందులోని నంబర్, లింక్, మోసానికి సంబంధించిన వివరాలను గుర్తించి.. ఇలాంటి ఘటనలపై ఇతర యూజర్లు చేసిన రిపోర్టులను కూడా చూపించేలా Scam Checkerను రూపొందించారు.
Scamfeedలో ఇతరుల అనుభవాలు
ఈ సేవలో Scamfeed అనే కమ్యూనిటీ ఫీచర్ కూడా ఉంది. ఇతరులు రిపోర్ట్ చేసిన స్కామ్‌లను చూడటంతో పాటు.. తాము ఎదుర్కొన్న అనుమానాస్పద ఘటనను స్వయంగా వివరించి రిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది.
భారత్‌లో Android యూజర్లకు
Truecaller ప్రకారం Scam Checker వెబ్‌లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. భారత్‌లో Android యాప్‌లోనూ ఈ ఫీచర్ ప్రారంభమైంది. ప్రస్తుతం iOS అందుబాటుపై స్పష్టత లేదు. భవిష్యత్తులో స్క్రీన్షాట్లను అప్లోడ్ చేసి స్కామ్‌లను విశ్లేషించే సదుపాయాన్ని కూడా తీసుకురావాలని కంపెనీ వెల్లడించింది.
ఏదైనా అనుమానం వస్తే వెంటనే లింక్ క్లిక్ చేయడం లేదా తిరిగి స్పందించడం కాకుండా.. ముందుగా చెక్ చేసుకోవడం ద్వారా ఆన్లైన్ మోసాల విషయంలో అదనపు జాగ్రత్త తీసుకోవచ్చు.