🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 30 Sep, 2026 | Page: 1

చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు ఖండించిన టీడీపీ 10వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్

చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని 10వ వార్డు టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కుమార్‌ అన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌పై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి అంటే ఏమిటో సోషల్‌ మీడియాలో ప్రచారాలు చేసేవారిని కాకుండా నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని కుమార్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. విమర్శలు చేయాలంటే ఆధారాలతో మాట్లాడాలని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని కుమార్‌ కోరారు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రజలే వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో వారు లేరని స్పష్టం చేశారు.
🏠 Home