కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు.. చిత్తూరు రోజా చౌదరికి అవార్డు!...
చిత్తూరు నుంచి చెన్నై వేదిక వరకు.. రోజా చౌదరి ఘన ప్రస్థానం!...
చిత్తూరు(రాజనీతి): చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు సవాళ్లు ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగిన చిత్తూరుకు చెందిన మహిళ రోజా చౌదరికి అరుదైన గౌరవం దక్కింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ‘సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు’ లభించింది. చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఈఓ దీపక్ టాటర్ జైన్ చేతుల మీదుగా రోజా చౌదరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లిన క్లిష్ట పరిస్థితులను సైతం ఎదుర్కొని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగిన రోజా చౌదరి ప్రయాణం పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. చిన్న వయసు నుంచే ఎదురైన ఇబ్బందులు, జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను ధైర్యంగా అధిగమిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. కష్టాలు ఎంతటి తీవ్రంగా ఉన్నా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని ఆమె ప్రయాణం చాటిచెబుతోంది. చెన్నై వేదికగా ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడంతో చిత్తూరు జిల్లాకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని పలువురు పేర్కొన్నారు. రోజా చౌదరికి అవార్డు లభించడం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, చిత్తూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కష్టాలను విజయానికి మెట్లుగా మార్చుకుని సౌత్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన రోజా చౌదరి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.