🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 17 Sep, 2026 | Page: 1

గణనాథుడి ఆశీస్సులతో 12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్ అడుగు.. నరిగపల్లిలో ఘనంగా చవితి వేడుకలు...

చిత్తూరు (రాజనీతి)దినపత్రిక దినపత్రిక :12వ డివిజన్‌ నరిగపల్లి ఎస్టీ కాలనీలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇంచార్జి గోపీనాథ్‌, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, యువత, చిన్నారులు, పసుపు సైన్యం కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు గణనాథుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి.వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు.కార్యక్రమంలో స్థానికులు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home