🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 17 Sep, 2026 | Page: 1

టీడీపీ టికెట్‌ కోసం ఛాన్స్‌.. దరఖాస్తులకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ పిలుపు!

చిత్తూరు (రాజనీతి) డైలీ దినపత్రిక: త్వరలో జరగనున్న చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న పార్టీ నాయకులు, యువత, మహిళలు, సామాజికవేత్తలు తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన యువత, మహిళలు, సామాజిక సేవలో చురుకుగా ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చిత్తూరు నగరంలోని వివిధ డివిజన్ల నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు పార్టీ నిర్దేశించిన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.దరఖాస్తులు లక్ష్మీనగర్‌ కాలనీలోని చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ ఆదివారం లోగా దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్నికలకు సంబంధించిన పార్టీ ప్రక్రియలో భాగంగా ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
🏠 Home