కార్యకర్తగా అడుగు.. నాయకుడిగా దూకుడు..చిత్తూరు కాజూరు బాలాజీ పై చర్చ!
చిత్తూరు (రాజనీతి డైలీ దినపత్రిక): తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాజూరు బాలాజీ సైనికుడిలా దూసుకుపోతున్నారని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి పార్టీ విధానాలను కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతో పాటు వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేస్తున్నారు.పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ప్రజల సమస్యలను తెలుసుకోవడం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడం వంటి అంశాలతో కాజూరు బాలాజీ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు నగర మేయర్ పదవికి కాజూరు బాలాజీ పేరు పరిశీలనలోకి వస్తుందా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఆయనకు మేయర్ పదవి దక్కితే హర్షం వ్యక్తం చేస్తామని పలువురు ప్రజలు పార్టీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉండటంతో అందరి దృష్టి అధిష్ఠానం నిర్ణయం పైనే ఉంది.