🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 12 Sep, 2026 | Page: 1

వైరల్ వీడియోతో కదిలిన ఎమ్మెల్యే.. వృద్ధ మహిళకు వెంటనే అండ!...రోజా చౌదరి

చిత్తూరు(రాజనీతి): ఓ వృద్ధ మహిళ వద్ద రూ.3 వేలు తీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ వెంటనే స్పందించారు. విషయం తెలుసుకున్న ఆయన తన కార్యాలయ సిబ్బందిని మహిళ వద్దకు పంపించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు అండగా నిలిచి, అవసరమైన దుస్తుల ఖర్చును స్వయంగా చెల్లించారు. సిబ్బంది వీడియో కాల్‌ ద్వారా మహిళను ఎమ్మెల్యేతో మాట్లాడించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే స్పందించి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా రోజా చౌదరి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వృద్ధ మహిళ సమస్యను తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే స్పందించి సహాయం చేయడం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవడం ద్వారా గురజాల జగన్‌మోహన్‌ మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి మహిళకు అవసరమైన సహాయం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రజలకు నాయకుడిపై భరోసా కలిగేలా ఎమ్మెల్యే వ్యవహరించారని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై నాయకులు తక్షణమే స్పందించి అండగా నిలిస్తే ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. మహిళకు అవసరమైన సమయంలో ఎమ్మెల్యే చూపిన మానవత్వం, తక్షణ స్పందన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
🏠 Home