🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 12 Sep, 2026 | Page: 1

కష్టాల్లో ప్రజలకు అండ.. రాజకీయాల్లో కజూర్ బాలాజీ జెండా!

చిత్తూరు:చిత్తూరు నగర రాజకీయాల్లో టీడీపీ సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. రాజకీయాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ, కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సహాయం చేయడం ద్వారా ఆయన స్థానిక ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చిత్తూరులో కజూర్ బాలాజీ పేరు వింటేనే సేవాభావం ప్రజలకు అండగా నిలిచే నాయకత్వం గుర్తుకు వస్తుందని ఆయన అభిమానులు అనుచరులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి తన పరిధిలో సహాయం అందిస్తూ బాలాజీ ప్రజలకు దగ్గరవుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పదవుల కంటే ప్రజా సేవకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయనకు నగరంలోని వివిధ వర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని ప్రజల్లో చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు మేయర్ అభ్యర్థిత్వ రేసులో కజూర్ బాలాజీ పేరు వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే పార్టీ నిర్ణయమే తుది నిర్ణయం కానుంది.మరోవైపు బాలాజీ తనయుడు జస్వంత్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే తపనతో ప్రజలకు అండగా నిలుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తండ్రి నుంచి సేవాభావాన్ని అందిపుచ్చుకున్న జస్వంత్ భవిష్యత్తులో ప్రజా జీవితంలో మరింత చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
🏠 Home