🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 12 Sep, 2026 | Page: 1

చిత్తూరుకు తరలిరండి.. శ్రీనివాసుడి కళ్యాణం కనులారా వీక్షించండి...చిత్తూరు 12వ డివిజన్ ఇంచార్జి గోపీనాథ్....

చిత్తూరు(రాజనీతి): చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌మోహన్ ఆధ్వర్యంలో నేడు చిత్తూరులో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు టీడీపీ చిత్తూరు 12వ డివిజన్ ఇన్‌చార్జి గోపీనాథ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీనివాస కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులందరికీ సాదర స్వాగతం పలికారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి, తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.చిత్తూరు నగరంలోని మెసానికల్ గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు గోపీనాథ్ వెల్లడించారు.భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
🏠 Home