పీజీ వైద్యులకు ఇక 24 గంటలే!
అమరావతి: పీజీ వైద్య విద్యార్థుల పని గంటలు, సెలవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిబంధనలు ప్రకటించింది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి వరుసగా విధుల్లో ఉంచకూడదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
నైట్ డ్యూటీ తర్వాత సెలవు
రాత్రి విధులు నిర్వహించిన పీజీ వైద్యులకు మరుసటి రోజు తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలని డీఎంఈ స్పష్టం చేశారు. అలాగే ప్రతి వారం ఒక రోజు పూర్తిస్థాయి వారాంతపు సెలవు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏడాదికి 20 రోజుల క్యాజువల్ లీవ్
పీజీ వైద్య విద్యార్థుల సెలవుల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 20 రోజుల పెయిడ్ క్యాజువల్ లీవులు, 5 రోజుల అకడమిక్ లీవులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఏడాదిలో 52 వారాంతపు సెలవులు కూడా కల్పించాల్సి ఉంటుంది.
ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు
పీజీ వైద్యులపై అధిక పని భారం, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్, టైమ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వైద్యుల ఆరోగ్యానికీ ప్రాధాన్యం
పీజీ వైద్యులు సుదీర్ఘ సమయం నిరంతరం విధులు నిర్వహించడం వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. వారి పనితీరు, రోగుల సంరక్షణ నాణ్యత మెరుగుపడేలా ఈ నిబంధనలను అమలు చేయాలని వైద్య విద్యాశాఖ భావిస్తోంది.
24 గంటల డ్యూటీకి బ్రేక్.. విశ్రాంతికి ప్రాధాన్యం!
పీజీ వైద్యులకు పని–విశ్రాంతి మధ్య సమతుల్యత ఉండేలా తీసుకున్న ఈ నిర్ణయం వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగించనుంది. అయితే ఆసుపత్రుల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షణ కీలకం కానుంది.