🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 28 Aug, 2026 | Page: 1

బెంగళూరులో క్రీడా అంశాలపై చర్చించిన చిత్తూరు 8వార్డు వెంగళరావు కాలనీ జర్నలిస్టులు...

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం అసిస్టెంట్ డైరెక్టర్ మంజునాథ్‌ను చిత్తూరు జిల్లాకు చెందిన జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులు వంశీ,ఇమ్మి అలియాస్ తేజ,వినోద్ సాగర్ ,జ్ఞానప్రకాష్,వెంకీ తదితరులు మంజునాథ్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలు, స్టేడియం నిర్వహణ, క్రికెట్‌ అభివృద్ధికి చేపడుతున్న చర్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికగా స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై మంజునాథ్ వివరించినట్లు జర్నలిస్టులు తెలిపారు.క్రీడల అభివృద్ధికి ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ మంజునాథ్‌తో జర్నలిస్టులు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది.
🏠 Home