🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 22 Aug, 2026 | Page: 1

పార్టీ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి నారా లోకేష్ కి ఫిర్యాదు

పార్టీలో క్రియాశీలకంగా పనిచేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ చిత్తూరు నియోజకవర్గానికి చెందిన యువకుడు ఆర్‌.ప్రవీణ్‌ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు రూరల్‌ మండలం అనంతాపురం గ్రామానికి చెందిన తనను స్థానిక నాయకుడు జయచంద్ర నాయుడు ఉద్దేశపూర్వకంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.గ్రామంలో తనను కాదని ఎవరూ ఎదగకూడదని, తాను ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టినా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారని ప్రవీణ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తున్న సమయంలో కూడా తనను అడ్డుకుని దాడి చేశారని ఆరోపించారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీలో యువత మరింత క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కొందరు యువతను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రవీణ్‌ తెలిపారు.పార్టీ కోసం చురుకుగా పనిచేసే వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి నారా లోకేశ్‌ సూచించినట్లు ప్రవీణ్‌ వెల్లడించారు. ఈ వ్యవహారంపై పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
🏠 Home