మదనపల్లి లో ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవం. జెడ్. ఎమ్. ఓ. నిర్మల్ అలెగ్జాండర్
రాజనీతి | మదనపల్లి | ఆగస్టు 20, 2026
జిల్లా కేంద్రం మదనపల్లి లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవం జెడ్. ఎమ్.ఓ(జోనల్ మలేరియా అధికారి )డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్ మరియు జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డిల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ప్రపంచ దోమల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత పై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు. ముందుగా సర్ రోనాల్డ్ రాస్ కు ఘనంగా జెడ్. ఎమ్. ఓ.డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్, పరిపాలన అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఆర్. బి. ఎస్. కే. జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ విష్షువర్ధన్ రెడ్డి, డి. ఎమ్. ఓ. రామచంద్ర రెడ్డి, ఎస్. ఓ. ఓబుల్ రెడ్డి,డిప్యూటీ. హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ, సబ్ యూనిట్ అధికారి ఖలీలుళ్ల ఖాన్ లు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుచు సర్ రోనాల్డ్ రాస్ అనే బ్రిటీష్ వైద్యులు 1897సంవత్సరములో మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుచున్నాదని తెలిపారు. మలేరియా పై వ్యతిరేకంగా జరుగుచున్న పోరాటం లో మన భారతదేశం లోని మన తెలుగు గడ్డ సికింద్రాబాద్ లోని మిలిటరీ క్యాంపు లో సర్ రోనాల్డ్ రాస్ కీలకమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేశారు అదేంటి అంటే ప్రపంచాన్ని వణికిస్తున్న మలేరియా అనే జ్వరానికి కారణం ప్లాస్మోడియo అనే పరాణ్ణజీవి అనీ, ఈ పరాన్న జీవిని ఆడ అనాఫిలిస్ దోమ జీర్ణశయం లో గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పాడు. అప్పుడు తెలిసింది అందరికి మలేరియా వ్యాధి దోమ ద్వారా వ్యాప్తి చెందుతాది అని. ఈ ఆవిష్కరణ కు గాను రోనాల్డ్ రాస్ కు 1902సంవత్సరము లో నోబెల్ బహుమతి వరించినది. ఆయన దోమ లో మలేరియా పరాన్నజీవిని కనిపెట్టిన రోజు ఆగష్టు 20.కావున ఆగష్టు 20వ తేదీని ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. తద్వారా దోమల నియంత్రణ చేపట్టడం వల్ల మలేరియా కేసులను గణనీయంగా తగ్గించగలగుచున్నాము. మరింత సమాణమైన ప్రపంచం కొరకు దోమలు లేని ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం కృషి చేద్దాం అనే నినాదం ఈ సంవత్సరము యొక్క తీమ్ అని తెలిపారు.డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు కీటకాల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులను నియంత్రణ చేయడం లో మనకు దిషనిరద్దెశం చేసిన మహనీయుడు నేడు మానవాలి మనుగడకు ఆయన చేసిన కృషి చిరస్మరనీయం, అచంద్రర్కాము అన్నారు.అనంతరం కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. జెడ్. ఎమ్.ఓ. డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం మరియు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జెడ్. ఎమ్. ఓ. డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్,ఏ. ఓ. డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డి. పి. ఎమ్. ఓ. డాక్టర్ రమేష్ బాబు, డి. ఎన్. ఎమ్. ఓ. డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ఎస్. ఓ. ఓబుల్ రెడ్డి,డి. ఎమ్. ఓ. రామచంద్ర రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ,సబ్ యూనిట్ అధికారి ఖలీలుళ్ల ఖాన్ హెల్త్ అసిస్టెంట్లు గంగయ్య గౌడ, కిరణ్, సురేంద్ర,ఏ. ఎన్. ఎమ్ లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.