🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 20 Aug, 2026 | Page: 1

లక్ష్మీపురం సమస్యకు చిత్తూరు నియోజకవర్గ 12వ డివిజన్‌ ఇంచార్జి గోపీనాథ్‌ ‘రూట్‌’ క్లియర్‌... వంతెన, సీసీ రోడ్లకు హామీ...!

ఇన్నాళ్లూ ఇబ్బందులే.. ఇక అభివృద్ధి బాటలో లక్ష్మీపురం!....

చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): లక్ష్మీపురం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. ఎన్నాళ్లుగానో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల సమస్యలను చిత్తూరు నియోజకవర్గం 12వ డివిజన్‌ టీడీపీ ఇంచార్జి గోపీనాథ్‌ స్వయంగా తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు.. వాటి పరిష్కారానికి చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు.లక్ష్మీపురం ప్రాంతంలో ప్రధానంగా వంతెన, సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయని స్థానికులు గోపీనాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలు కురిసిన సమయంలో రహదారులు అధ్వానంగా మారడం, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటం, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెళ్లేందుకు కూడా అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు.చిన్నారులు, వృద్ధులు, మహిళలు రాకపోకలు సాగించే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.ప్రజల సమస్యలను ఓపికగా విన్న గోపీనాథ్‌.. సమస్యలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మీపురంలో అవసరమైన చోట వంతెన నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్య ఏదైనా తన దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారులతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానని గోపీనాథ్‌ తెలిపారు. అభివృద్ధి పనులు కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.

ప్రజల గోడు ఎమ్మెల్యే చెవికి.. పరిష్కారానికి గోపీనాథ్‌ పరుగులు!....

లక్ష్మీపురం ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి, వంతెన సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు, సమస్యను తమ దృష్టికి తీసుకెళ్లిన గోపీనాథ్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఇన్నాళ్లూ ఇబ్బందులే.. ఇక అభివృద్ధి బాటలో లక్ష్మీపురం! ప్రజల సమస్యను గుర్తించి పరిష్కారం దిశగా అడుగులు పడుతుండటంతో లక్ష్మీపురం రూపురేఖలు మారనున్నాయన్న ఆశ స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
🏠 Home