🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 15 Aug, 2026 | Page: 1

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి

వీరబల్లి:
వృద్దులకు, రోగులకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి కలదని విఆర్డీఎస్ సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. శనివారం వీరబల్లికి చెందిన శ్రీ దుగ్గనపల్లి కృష్ణారెడ్డి డిగ్రీ కళాశాల వ్యవస్థాపకుడు క్రిష్ణారెడ్డి ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారుడు సురేంద్రరెడ్డి విఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్దులకు, రోగులకు పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణి చేశారు. తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేపడుతామని,ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.ఆనందం అనేది వ్యక్తుల ద్వార, వస్తువుల ద్వార రాదని మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారానే వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్డికెఆర్ సిబ్బంది వెంకటరమణ, వైద్య సిబ్బంది వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home