🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 15 Aug, 2026 | Page: 1

అంకితభావానికి గుర్తింపు.. కానిస్టేబుల్ హేమంత్ కు ఉత్కృష్ట సేవా పతకం

రేణిగుంట, ఆగస్టు 15 (రాజనీతి): పోలీసు శాఖలో విధి నిర్వహణలో ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించిన రేణిగుంట కోర్టు కానిస్టేబుల్‌ హేమంత్‌కు ఉత్కృష్ట సేవా పతకం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా ఆయన పతకం అందుకున్నారు. కోర్టు విధుల్లో కేసుల నిర్వహణ, పోలీసు–న్యాయవ్యవస్థ సమన్వయం, పత్రాల నిర్వహణ, నిందితుల హాజరు తదితర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2025 సంవత్సరానికి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ గౌరవం మరింత బాధ్యత పెంచిందని హేమంత్‌ తెలిపారు. ఆయనను పోలీసు, న్యాయస్థాన సిబ్బంది అభినందించారు.
🏠 Home