🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 15 Aug, 2026 | Page: 1

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


రాజనీతి | సోమల | ఆగస్టు 15, 2026:
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కరణం శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మరియు సిబ్బంది, ప్రజాప్రతినిధులు మునిరాజ నాయుడు, ఎన్ శ్రీనివాసులు, గందోడి బాబు,రైతులు, వ్యాపారులు, స్థానిక నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
🏠 Home