మాతాశిశు సంరక్షణ కొరకు ఆధునీకరించిన తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్. ఎల్. ఏ.
మదనపల్లి | ఆగస్టు 11, 2026
మాతాశిశు సంరక్షణ లో భాగంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి గాను దేశము లోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధునికరించిన తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహన సేవలను అందుబాటులో కి తెచ్చింది.ఈ రోజు మంగళవారం జిల్లా కేంద్రం లోని ఆస్పత్రి ప్రాoగనములో గౌరవ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ మరియు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సాజహాన్ బాషా తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహన సేవలను పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు అదునాతన సౌకర్యాలలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగ్స్, అత్యవసర సమయం లో మహిళలకు వెంటనే సహాయం అందేలా ఎమర్జెన్సీ బటన్, అగ్ని ప్రమాదం జరిగినపుడు రక్షణ చర్యలు, జి. పి. ఎస్. లొకేషన్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.ఈ వాహనం పూర్తిగా ఏ. సి. సౌకర్యం ఉంటుంది.వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశలో భాగంగా ఈ తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాలు జిల్లా లోని ఏ ప్రాంతానికైనా అనగా ప్రభుత్వ అస్పటల్ లో ప్రసవం జరిగి డిశ్చార్జ్ అయినపుడు భాలింత, నవజాత శిశువును, వారి సహాయకులను వారి నివాసం ఉండే ఊరుకు ఉచితంగా క్షేమంగా తీసుకుని వెళ్ళతాయి.హైరిస్క్ గర్భిణీలకు, ఎక్కువ రక్తహీనత చికిత్స కొరకు సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్ళడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.ఈ సేవలు పొందడానికి టోల్ ఫ్రీ నెంబర్ 102కు కాల్ చేసి పొందవచ్చును.ఈ సేవలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.మదనపల్లి జిల్లా కు 12 వాహనాలు రావడం జరిగింది. అనంతరం ఎమ్. ఎల్. ఏ మరియు జిల్లా కలెక్టర్ వారు ప్రసవం అయి డిశ్చార్జ్ అయిన బాలింతలతో తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ సేవల గురించి అడిగి వారి స్పందన తెలుసుకున్నారు. ఈ తల్లీ బిడ్డల వాహన సేవలు గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు ఎంతో ఉపయోగం అని ఈ సేవలు అమలు చేస్తున్న ప్రభుత్వమునకు, ముఖ్యమంత్రి కి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో డి. ఎమ్. హెచ్. ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మనసుర్ అహమ్మద్, ఆర్. ఎమ్. ఓ. డాక్టర్ రాధిక, డి. సి. హెచ్. ఎస్. డాక్టర్ లక్ష్మీప్రసాద్,, డి. పి. ఎమ్. ఓ. డాక్టర్ రమేష్ బాబు,డి. ఈ. ఐ. సి. వైద్యులు డాక్టర్ స్వాతి ఇంద్రమణి దుభే, 104జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ లోకవర్ధన్, డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ, 102 వాహనాల జిల్లా కోఆర్డినేటర్ ఈ.నాగభూషణం, N. ప్రవీణ్ కుమార్ , M. మణి, హెల్త్ అసిస్టెంట్ గంగయ్య గౌడ,టి. బి. పర్యవేక్షకులు ప్రభాకర్ మరియు హెడ్ నర్సస్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.