🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 30 Jul, 2026 | Page: 1

జగన్.. శ్రీకాకుళం పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి!-మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్న జగన్..

రాజనీతి | 30 జూలై 2026

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం అంపోలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజును ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. ఎన్నికల అనంతరం జగన్ శ్రీకాకుళం జిల్లాకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

పర్యటనలో భాగంగా జగన్ ముందుగా అంపోలు జిల్లా జైలుకు వెళ్లి అప్పలరాజును కలవనున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందనే సందేశాన్ని ఈ పర్యటన ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ శ్రీకాకుళం వస్తున్నారని సమాచారం.

ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన దృష్ట్యా జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు అనుమతి లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో జగన్ జైలు ములాఖత్, కుటుంబ సభ్యుల పరామర్శకే తన పర్యటనను పరిమితం చేయనున్నారు.
🏠 Home