🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 28 Jul, 2026 | Page: 1

విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి మదనపల్లిలో వైసీపీ రాష్ట్ర విద్యార్థి యూత్ ర్యాలీలో నిసర్ అహ్మద్ గారి తో కలిసి ర్యాలీలో పాల్గొన్న. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వి హరి

ఈరోజు మదనపల్లిలో వైసీపీ రాష్ట్ర విద్యార్థి యూత్ ర్యాలీలో నిసర్ అహ్మద్ గారి తో కలిసి ర్యాలీలో పాల్గొన్న. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వి హరి

ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యూత్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేశారని ఈరోజు మదనపల్లి పట్టణంలో కలెక్టరేట్ దగ్గర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించినారు ఈ ర్యాలీలో 2024లో మెగా డీఎస్సీ ని ప్రవేశపెట్టి 2026లో దగడీఎస్సీగా మార్చి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొత్తగా స్పోర్ట్స్ కోటా కింద జీవోను ప్రవేశపెట్టి అతని సొంత మనసులకు లక్షలు పుచ్చుకొని ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వటం జరిగిందని కష్టపడి చదివి డీఎస్సీలో ఉత్తీర్ణులైన అర్హులైన అభ్యర్థులను పక్కనపెట్టి తన సొంత మనసులకు పోస్టింగులు ఇవ్వడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు మదనపల్లిలో పెద్ద ఎత్తున విద్యార్థి యూత్ ర్యాలీ నిర్వహించినారు

ఈ ర్యాలీకి మద్దతుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి ఇన్చార్జి నిషార్ అహ్మద్ గారు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు దేశాయ్ తిప్పారెడ్డి గారు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు

అలాగే సూపర్ సిక్స్ పథకాలలో నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయలు చెల్లిస్తానని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి అధికారం చేపట్టాక నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి నిరుద్యోగ భృతిని ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఈ ర్యాలీ నందు నిరుద్యోగులు వారు గోడును వినిపించినారు ఇది మెగా డీఎస్సీ కాదు ఇది దగడిఎస్సి అని డి ఎస్సి అభ్యర్థులు నినాదాలు చేస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసినారు అలాగే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థి యూత్ నాయకులు వినతి పత్రం అందజేసినారు ఈ వినతి పత్రంలో డీఎస్సీ లో జరిగిన అవకతవకలను విచారించి సి.బి.ఐ సిబిఐ ద్వారా విచారించి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరారు

ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రసాద్ బాబు రామసముద్రం మండలం వైసిపి జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు మాల తోట నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యుడు అమ్రేష్ మల్లికార్జున విజయ్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు
🏠 Home