🏠 www.rajaneethi.in
Watermark
Newspaper Logo
www.rajaneethi.in | Date: 28 Jul, 2026 | Page: 1

కామన్వెల్త్‌లో తెలుగు తేజం.. రజత విజేత అజయ్ బాబుకు మంత్రులు, సాప్ ఛైర్మన్ అభినందనలు

అమరావతి: కామన్వెల్త్ గేమ్స్-2026లో వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన తెలుగు క్రీడాకారుడు వల్లూరి అజయ్ బాబుకు రాష్ట్ర మంత్రులు, క్రీడా ప్రముఖులు అభినందనలు తెలిపారు.

రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అజయ్ బాబు విజయాన్ని కొనియాడుతూ, అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమని అన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ (SAP) ఛైర్మన్ ఆనంద్ బాబు కూడా అజయ్ బాబును అభినందించారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావంతో సాధించిన ఈ విజయం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా పూర్తి సహకారం కొనసాగుతుందని వారు తెలిపారు.

కామన్వెల్త్ క్రీడల్లో అజయ్ బాబు సాధించిన రజత పతకం భారత పతకాల ఖాతాలో మరో కీలక విజయంగా నిలవడంతో పాటు, తెలుగు క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి మరోసారి చాటిందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
🏠 Home